కవిగూడ నేతగాడే -కాళోజి డిసెంబరు 29, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.4 comments
కవి గూడ నేతగాడే
బహు చక్కని సాలెగూడు అల్లువెడే
రాజకీయ బల్లీ(యు)ల
నోటికి అందక ఎగిరెడి పక్షీ(యు)ల
(ఇంకా…)
బ్రతుకు -కాళోజి డిసెంబరు 25, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.10 comments
సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు
(ఇంకా…)
శాస్త్రం పద్ధతి -కాళోజి డిసెంబరు 24, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.1 comment so far
శాస్త్రం పద్ధతి చెపుతుంది
ఆచరణ బ్రతుకు చాటుతుంది
శాస్త్రం ఆదర్శం వల్లె వేస్తుంది
ఆచరణ సాధ్యం నిరూపిస్తుంది
దేవుడు -కాళోజి డిసెంబరు 23, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.2 comments
దేవుడు దేవుడు దేవుడు
దేవుడు లేందెవరికి?
ఎవరి దేవుడు వారికి
మనిషి మనిషి కొక్కొక్క మనసు
(ఇంకా…)
అందరివాడు -కాళోజి డిసెంబరు 11, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.3 comments
అందరి వాడైనవాడు
ఏ ఒక్కనికి అంకితమ్ము కాజాలడు
ఏ ఒక్కనికి అంకితమ్ము అయినవాడు
అందరికి అయినవాడు కానేరడు
నలుబదైదు సంతకాల నటుడా? -కాళోజి నవంబరు 25, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.add a comment
నా నోటికాడి బుక్కను
నాణ్యంగా కాజేసిన
నాగరికుడా ‘విను’
నా నాగటి చాలులోన
నాజూకుగ పవ్వళించి
నను కాటేసిన
నాగరికుడా విను?
ప్రాంతం వాడే దోపిడి చేస్తే నవంబరు 25, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.2 comments
దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం
(ఇంకా…)
తెలంగాణ బాస -కాళోజి నవంబరు 25, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.12 comments
తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు
కాటేసి తీరాలె –కాళోజి నవంబరు 20, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.6 comments
కాటేసి తీరాలెమన కొంపలార్చిన మన స్ర్తీల చెరచిన
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరిచి పోకుండగ గురుతుంచుకోవాలె
(ఇంకా…)
మనిషి ఎంత మంచివాడు -కాళోజి నవంబరు 19, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.1 comment so far
మనిషి ఎంత మంచివాడు
చనిపొయిన వాని చెడును
వెను వెంటనే మరుస్తాడు
కని మంచినె తలుస్తాడు
మనిషి ఎంత చెడ్డవాడు
బ్రతికివున్న మనిషిలోని
మంచినెపుడు గుర్తించుడు
చెడును వెతికి కెలుకుతాడు
–కాళోజి
తినలేక/ తినలేక –కాళోజి నవంబరు 19, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.add a comment
ఒకడు కుతికెలదాక
మెక్కినోడు
మరొకడు మింగు మెతుకు
లేనోడు
ఇద్దరికీ గొంతు పెకలదు
ఇద్దరికీ ఊపిరాడదు
ఇద్దరి అవస్థకు
ఒకే కారణం -
తినలేక
–కాళోజి
ప్రత్యేక తెలంగాణ అంటే –కాళోజి నవంబరు 18, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.11 comments
ప్రత్యేక తెలంగాణ అంటే
పక్కలిరగ తన్నేందుకు
ఆ.ప్ర.రా. ప్రభుత్వాన్కి
అధికారము ఎక్కడిది?
నిర్వాకం –కాళోజి నవంబరు 18, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.add a comment
నమ్ముకొని పెత్తనము ఇస్తే
నమ్మకము పోగొట్టుకొంటివి
కుప్పకావలి ఉండి కట్టలు
తప్పదీస్తివి ముద్దెరేస్తివి
సాటివాడు చేరదీస్తే
నోటినిండా మన్ను గొడ్తివి
నేను – నా గొడవ –కాళోజి నవంబరు 18, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.add a comment
నేనంటే నేడు
నా గొడవంటే నాడు
నిజమో కాదోకల రుజువు
నీవు నేనూ వాడూ
నేనంటె నేటి మనస్థితి వైనం
నెనంటె భరత పౌరుడు
నా గొడవ ఆ పౌరుని స్థితి
నేనంటే ఒక వోటరు
నా గొడవ వోటేసేవాడు
నేనంటే తిరుగుబాటు దారు
నా గొడవ మన తిరుగుబాటు
–కాళోజి
నడత నాణ్యం -కాళోజి నవంబరు 18, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.add a comment
దొంగవలె అందాల తొంగిచూచుట తప్పు
అగుపడిన అందాన్ని అరయకుండుట తప్పు
కనపడ్డ ప్రతిదాని కాసపడుటయు తప్పు
భంగపడి వాంఛలకు లొంగిపోవుట తప్పు
కినుకతో మదిలోన క్రుంగిపోవుట తప్పు
పైకి ప్రహ్లాదువలె పలుకుచుండుట తప్పు
సహజ ప్రవృత్తులను చంపివేయట తప్పు
సహజమని వృత్తుల చంకచేరుట తప్పు
–కాళోజి



