jump to navigation

కాటేసి తీరాలె –కాళోజి నవంబరు 20, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
trackback

కాటేసి తీరాలెమన కొంపలార్చిన మన స్ర్తీల చెరచిన
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరిచి పోకుండగ గురుతుంచుకోవాలె
కసి ఆరిపొకుండ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుసకోట్టుచుండాలె
కాలంబు రాగానే కాటేసి తీరాలె
‘సత్యమ్మహింస’యని సంకోచ పదరాదు
‘దయయు ధర్మం’ బనుచు తడుముకో పని లేదు
‘శాంతి’యని చాటినను శాంతింపగా రాదు
‘క్షమ’యని వేడినను క్షమియింపగారాదు
‘చాణక్య నీతి’ నాచరణలో పెట్టాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె.
తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలె
కొంగులాగిన వ్రేళ్ల కొలిమిలో పెట్టాలె
కన్ను గీటిన కళ్ల కారాలు చల్లాలె
తన్నిన కాళ్లను ‘డాకలి’గ వాడాలె
కండ కండగ కోసి కాకులకు వెయ్యలె
కాలంబు రాగానే కాటేసి తీరాలె.
–కాళోజి
 

—————————————–

1948 సం||లో గుల్బర్గా జైల్లో ఉన్నప్పుడు రజాకార్లు జనగాం తాలూకాలోని బైరాన్ పల్లి గ్రామ ప్రజలపై మూకుమ్మడిగా జరిపిన అత్యాచారాల వార్తలను చదివి ఆవేదన చెంది రాసిన గేయం

వ్యాఖ్యలు»

1. mbbhushan - నవంబరు 23, 2006

కాటేసి తీరాలెమన కొంపలార్చిన మన స్ర్తీల చెరచిన
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను

కండ కండగ కోసి కాకులకు వెయ్యలె
కాలంబు రాగానే కాటేసి తీరాలె
one of the greatest voices of action. assertion. a call that is applicable for all times in the face of exploitation.

aggression and oppression today may be different from the atrocity that made kaloji give such call for a war against brutal forces.
but can one ignore that one doesn’t get liberation by failing to oppose the oppressive forces?

kaloji inspires people to stand for what we value and what we live for and speak to that speak that in unambiguous manner

great posting from kaloji’s writings !

2. Jaya Prakash - డిసెంబరు 10, 2006

“కోటిన్నర మేటి ప్రజల
గొంతోక్కటి గొడవొక్కటి
తెలంగాణ వెలిగి నిలిచి
ఫలించెలె భారతాన”

These lines itself are such a great inspiration to this generation to fight towards the cause.

3. Harikrishna. - ఫిబ్రవరి 5, 2007

dear friends ,
Every Telanganate should, make all Telaganates to know about the Telangana culture and tradition,and the pain of our ancestors who sacrificed their lifes for telangana in all aspects to the entire world, viewers of these poetry , pass this to all around the world of telangana people.make Telangana people unite , its reponsibility of every one who took birth on the telangana Bhoomi (gadda)

JAI TELANGANA !

4. rakesh - జులై 19, 2007

“కోటిన్నర మేటి ప్రజల
గొంతోక్కటి గొడవొక్కటి
తెలంగాణ వెలిగి నిలిచి
ఫలించెలె భారతాన”

Now the voices are more than 3.5 crores!!

How long… how far… how much more time to wait?
Raavaale raavale… telangana raavale…..

5. rajashaker - సెప్టెంబరు 14, 2007

JAI TELANGANA , JAI JAI TELANGANA

6. rapaka - డిసెంబరు 3, 2007

Kaalanna maatalu peda chevina pettina ii prabuthvam rojulu dhaggira paddayi.. kotinnara nundi muudunna kotlu ayina rajakilayu matram chethaane vunnaru ii naayakulu, kandlu therichi telangana iiyyale ikanainaaa ii naayakulu, ledante kaali basmam ayithaaru telangonalla sethullo!! Ji Telangana


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.