jump to navigation

అందరివాడు -కాళోజి డిసెంబరు 11, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
trackback

అందరి వాడైనవాడు
ఏ ఒక్కనికి అంకితమ్ము కాజాలడు
ఏ ఒక్కనికి అంకితమ్ము అయినవాడు
అందరికి అయినవాడు కానేరడు

అందరికి అయిన వాణ్ణి
ప్రతి ఒక్కడు నా వాడని
వాడు నావాడు కాకుండవుతున్నాడని
పడుచుండును ఆరాటము.

అందరి వాడైన వాడు
ఏ ఒక్కనికి అంకితమ్ము కాజాలడు
అందరి వాడైన వాడు
ఏ ఒక్కనికి
అన్ని తీర్ల అనుకూలుడు కాజాలడు

అందరి వాడైన వాణ్ణి
ప్రతి ఒక్కడు
అన్ని తీర్ల తనకే అనుకూలుడు కాదని పడు ఆరాటము
అంత తుదకు వపరీతము

యీ నడవడి పరిణామము
ఆరాటము తీరనట్టి ప్రతి ఒక్కడు
అందరి వాడైన వాణ్ణి
తనవాడసలే  కాదని
తరమి కొట్టి తృప్తి జెందు

అందరి వాడైన వాడు
ఏకాకే ఎల్లప్పుడు
అయినా అందరివాడె
ఏ ఒక్కనికి అంకితమ్ము కానివాడె.

కాళోజి

వ్యాఖ్యలు»

1. వైజాసత్య - డిసెంబరు 11, 2006

చాలా బాగుంది. బాగా రాశారు.

2. radhika - డిసెంబరు 11, 2006

naaku civari khandika chaalaa caalaa nachindi.

3. Kondapalli Venu Gopal Rao - డిసెంబరు 15, 2006

kaloji gurunchi entha cheppina thakkuvey.naa chinnappudu manchineela nalladaggariki velli nappudu kotlata ayi nalla bandaipoyindani vachi maa ammaku chepputhuntey
Kaloji natho ann mata

Bindelu BIndelu kotladukuntey
Madyana nademi poyindani
Nalla bandainadira