jump to navigation

కవిగూడ నేతగాడే -కాళోజి డిసెంబరు 29, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
trackback

కవి గూడ నేతగాడే
బహు చక్కని సాలెగూడు అల్లువెడే
రాజకీయ బల్లీ(యు)ల
నోటికి అందక ఎగిరెడి పక్షీ(యు)ల
చూపుల కనుపించనట్టి
సుకుమారపు సూత్రాలతొ -
బహు చక్కని సాలెగూడు అల్లువాడె
కవి గూడ నేతగాడె
రాజకీయ బల్లీ(యు)ల
రక్తసిక్త హస్తాలతొ ఎగరేసిన
తెలతెల్లని కపోతాలు వాలగ, కూర్చొని పాడగ
కైత; సింగిణీల దీర్చు
కవి గూడ నేత గాడె
బహు చక్కని సాలెగూడు అల్లువాడే

–కాళోజి (1972)

వ్యాఖ్యలు»

1. a s gopal - మార్చి 23, 2008

it is every good i really want to read about shri kaloji life history

2. a s gopal - ఏప్రియల్ 9, 2008

yes very fine

3. satheesh - అక్టోబర్ 24, 2008

inspiration about us

4. నల్ల చంద్ర స్వామి - ఆగష్టు 26, 2009

yes its real kavi good netha gaade