jump to navigation

లోకనాయక్ -కాళోజి నవంబరు 18, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
add a comment

పుటుక నీది
చావు నీది
బ్రతుకుంతా దేశానిది

———————
లోకెనాయక్ జయప్రకాశ్ నారయణ్ మరణించిన సందర్బంగా కాళోజి అన్న మాటలు

చాదస్తం -కాళోజీ నవంబరు 18, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
add a comment

ప్రతీ చాదస్తం దేవుడే
ఏదో ఒక రూపంలో గోకుడే
పుట్టుకతోనే పుట్టునీపుండు
అగపడక అంతరంగాననుండు
(ఇంకా…)

పోదాం పదరా!! నవంబరు 18, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
add a comment

పదరా పదరా పోదాం పదరా
తెలంగాణ సాధిద్దాం పదరా
దొంగల దూరం కొడదాం పదరా
వేరే రాజ్యం చేద్దాం పదరా           || పదరా ||

(ఇంకా…)

ఏటేటా ఎందుకు నీ పాట -కాళోజీ నవంబరు 17, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
add a comment

ఏడు మారినా ఈడు ముదిరినా
ఏమి మారినది యీ లోకంలో?
రాయి రువ్వినా రాకెట్ విసిరినా
గిట్టని వానిని కొట్టుటకే కద!
(ఇంకా…)

వ్యత్యాసాలు -కాళోజీ నవంబరు 17, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
add a comment

అన్నపురాసులు ఒక చోట
ఆకలిమంటలు ఒక చోట
హంసతూలిక లొకచోట
అలసిన దేహా లొకచోట
(ఇంకా…)

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? -కాళోజీ నవంబరు 17, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
add a comment

అవనిపై జరిగేటి అవకతవకలు జూచి
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?
పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె
మాయ మోసము జూచి మండిపొవును ఒళ్ళు
(ఇంకా…)

ద్వైత జగత్తు -కాళోజీ నవంబరు 17, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
add a comment

కుటిలమతులు దేబెమొగాలు
జగతిలో రెండే రెండు రకాలు
చతురవర్గ విలాసం కొరకు
దేబెల సర్వస్వం ముడిసరుకు
(ఇంకా…)

తెలంగాణ వేరైతే -కాళోజీ నవంబరు 17, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
1 comment so far

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?

(ఇంకా…)

వీర తెలంగాణ నాది -కాళోజీ నవంబరు 16, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
add a comment

వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది
వేరై కూడ తెలంగాణ వీరతెలంగాణ ముమ్మటికి
తెలంగాణ వేరై నిలచి భారతాన వెలయు ముమ్మటికి

(ఇంకా…)