jump to navigation

బ్రతుకు -కాళోజి డిసెంబర్ 25, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
trackback

సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు
ఆగిపోయిన ముందు
సాగనే లేవెపుడు
వేచియుండిన పోను
నోచుకోనే లేవు.
తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలయు.
బ్రతుకు పోరాటము
పడకు ఆరాటము.
బ్రతకదలచిన పోరు
సుతరాం తప్పదు.
చూపతలచిన జోరు
రేపనుట ఒప్పదు.

-కాళోజి

వ్యాఖ్యలు»

1. radhika - డిసెంబర్ 25, 2006

adbhutamayina kavita.viiri kavitalu cadive avakaasam naaku raledu.mii valla manchi kavitalu chadava galugutunnanu.thanks

2. Thyaga - డిసెంబర్ 25, 2006

bAvundi…mee praytanam abinandanIyam

3. Prasad Charasala - డిసెంబర్ 27, 2006

అన్ని సందర్భాలకూ ఇది బైబిల్ వచనం కాక పోవచ్చు.
“తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలయు.”
తోవివ్వడని అందరూ తోయడం మొదలు పెడితే కొత్త సినిమా మొదటి ఆటకు టికెట్లకు తోసుకొనే తోపులాట ప్రతిచోటా కనిపిస్తుంది. తోవ ఇవ్వని వాడు నాలాగే ఆకలితో వున్నవాడా? ఆకలి తీరి మదమెక్కి వున్నవాడా అనేది చూడాలి. నాలాగే ఆకలిగొన్న వాన్ని తోసేసి ముందుకెళ్ళడం కంటే ఆకలితో చివరివరసలో ప్రాణం విడువడమే వుత్తమమేమొ!

–ప్రసాద్
http://blog.charasala.com

4. Jags - జనవరి 5, 2007

@prasad

నాలాగే ఆకలిగొన్న వాన్ని తోసేసి ముందుకెళ్ళడం కంటే ఆకలితో చివరివరసలో ప్రాణం విడువడమే వుత్తమమేమొ!

maanaveeyatakidi nidarshanam:)

5. చైతన్య - ఫిబ్రవరి 24, 2007

“తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలయు.”

ఈ పదాలని face-value తో అర్థం చేసుకోవడం కన్నా అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలేమో అనిపిస్తుంది. నాకు కవిత్వం గురించి ఎక్కువ తెలువదు. చదివిన ప్రతి సారీ ఒక కొత్త అర్థం స్ఫురించే కవిత గొప్పదని ఒక కవిమితృడు చెప్పిండు. నాకైతే ఈ రెండు లైన్లు ఇట్లా అర్థం అయినయి. కవి ఈ కవితలో బ్రతుకు గురించి మట్లాడుతున్నడు కాబట్టి ఈ రెండు లైన్లు కూడా బ్రతుకు గురించే అన్నడనిపించింది. తొలగి తోవెవడిచ్చు – బ్రతుకు పరిచిన విస్తరి కాదు, బ్రతుకు పోరాటంలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. త్రోసుకొని పోవలయు – ఆ అడ్డంకుల్ని అధిగమిస్తూ బ్రతుకుని సాగించాలి. బ్రతుకు పూల బాట కాదని, అయినా బ్రతుకుని గౌరవిస్తూ ముందుకు వెళ్ళలని చెప్పిన కాళోజీ కవితలో గొప్ప మానవీయ కోణం ఉందని అనుకుంటున్నా.

ramesh - సెప్టెంబర్ 7, 2019

mee samadaanam sariainadi

6. vamshi - జూన్ 28, 2007

avunu ee 2 lines ni mallee chadivithe manchi artham spuristhundani (kanipistundani) anipistondi.. … kaloji garu…nee laaga aakali gonna maro vanni toskupommani cheppaledu . . anni vunnaa kaani neeku annam dorakoddani chuse ,neeku aakali puttinche vallani tosukupommanattu naakanipistundi…. emantaru..

mee sodarudu… vamshi

7. vamshi - జూన్ 28, 2007
8. raamulbhaai - జూలై 30, 2007

కాళోజీ గొప్ప మానవతావాది , తన రచనలతో తెలుగునాట అతిసామాన్యునికి కూడా అర్ధమయ్యే విధంగా చెప్పి రాజకీయ,పోరాట చైతన్యాన్ని తెచ్చిన వాడు. కనుక నాద్రుష్టిలో శ్రీశ్రీ అంతటి గౌరవం పొందదగినవాడు.కాని కాళోజీని మన తెలుగు పత్రికలు, సాహితీవిమర్శకులు తగినంతగా పట్టించుకోలేదు ఎందుకంటే తెలంగాణవాడు కాబట్టి అనుకుంటాను. మరి ఆయనకూడా సమైక్యవాదిగా ఉన్నరోజుల్లో అంటే 69 ఉద్యమానికి ముందు తగినంతగా (సుమారు శ్రీ శ్రీ కి ఇచ్చినంత గౌరవం) ఇచ్చిఉన్నారేమో నాకు తెలియదు,అప్పటివాళ్ళు అంటే 70-80 ఏళ్ళవాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఆయన రచనలు చదువుతుంటే ఆయన రచనలన్నీ వెతికిపట్టుకొని చదవాలనిపిస్తున్నది. వారిరచనల్లో కొన్నైనా వెబ్‌సైట్‌లో వుంచి ఇప్పటి తరానికి చదివే అవకాశం కల్పించినందుకు క్రుతజ్ఞతలు. ఇప్పుడు భౌతికంగ పత్రికలను చదివే అలవాటు, అవకాశం ముఖ్యంగా ఇప్పటివాళ్ళకు లేదు కనుక చదివిన వారందరూ క్రుతజ్ఞతలు చెప్పడము ముదావహము.
_రాముల్‌భాయి్

9. rajashaker - సెప్టెంబర్ 14, 2007

ikkada okar u iddarini comment cheyyaline ante naaku kooda manchiga anipisthaledu, but those peoples comments are forcing to commetn on their comments,
PRASAD CHARASALA garau, meeru annattu bathuku anedi kotha movie daggara booking counter kaadu. its a struggle. ee bathukulo unna kastalu , vaatine kaliginche manushulu , paristhithula gurinchi , vaatini ‘mind’ lo unchukoni raasina poem adi,
anthe kaani kotha cinema gurinchi, cricket match ticket la gurinchi raasina peoem kaadu.

10. satheesh - అక్టోబర్ 24, 2008

i accepet with kavitha

11. shyamsunderrao kandukuri - మే 19, 2012

కాలోజీ నారాయనరావుగారఊ తెలంగాణ ముద్ద్దు బిద్ద. అతని గురిన్చి శ్యామసుందర్రావూగారు ఇలా పేర్కొన్నారు. అట మడ్యహాన్నమువేళ ప్రచండుడై మార్థాన్దుడు సాటి మానవులకు ద్రోహం చేయు ముశ్కరుల తన భీకర జ్వాలలచేత్అ భస్మీపటల్అమ్ చేసెదననుచూ అమాయకులకు అండగా నిలిచెదననుచూ ప్రతిన్అ బూని, ప్రకాశించుచున్నవేళ ఆగు ఆగు సూర్య భగవానుడా నేను భూమిపైకిన్జని మానవ రూపమ్లో కవిగా తెలన్గానమునన్దు జన్మించి అక్రుత్యములెరుగని అమాయకుల్అ చైతన్యపరచి నెరవేర్చెద్అ నీదు సమ్కల్పముననుచూ ఏతెంచె ఉర్విపైకి కాలుడిలా కాలోజీ.

12. srinivas - సెప్టెంబర్ 21, 2013

ee kavitha gurchi entha cheppina thakkuve….

13. mylaram gangadhar - జూన్ 13, 2014

ee kavitha bathuku poratam, kasta padatam

14. Madhu Rendla - ఫిబ్రవరి 7, 2015

anna, ee blog bagundi..

Prajakavula rachanalu chadivina prathisari oka kotha utsaham, oka kotha prerana vastadi.

mee daggara koloji books PDF lantivi unte ikada pettandi, endukante meeru type chesi pettalsina avasaram undadu.

Mana kavithaasakthini, samayanni, shakthini kotha kavithala srushtiki viniyogiste, mana koloji kavihtwam sarthakam avutundi ani na bhavana.

15. Anil - ఫిబ్రవరి 14, 2015

He is agreat poet no one reach him as a humanity and revalutionly

16. jadav santhosh - ఏప్రిల్ 9, 2015

nijanga nenu chala adrusta vanthunni kalojee gari kavithalu chadavurhunnanantey mi vallaney…. thank you sir….guruvu and shishyula mida kalojee gari kavithaly thelugu lo pampa galaru……


వ్యాఖ్యానించండి