jump to navigation

నలుబదైదు సంతకాల నటుడా? -కాళోజి నవంబర్ 25, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
3 వ్యాఖ్యలు

నా నోటికాడి బుక్కను
నాణ్యంగా కాజేసిన
నాగరికుడా ‘విను’

నా నాగటి చాలులోన
నాజూకుగ పవ్వళించి
నను కాటేసిన
నాగరికుడా విను?

(మరింత…)

ప్రాంతం వాడే దోపిడి చేస్తే నవంబర్ 25, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
16 వ్యాఖ్యలు

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం
(మరింత…)

తెలంగాణ బాస -కాళోజి నవంబర్ 25, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
38 వ్యాఖ్యలు

తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు

(మరింత…)

కాటేసి తీరాలె –కాళోజి నవంబర్ 20, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
8 వ్యాఖ్యలు

కాటేసి తీరాలెమన కొంపలార్చిన మన స్ర్తీల చెరచిన
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరిచి పోకుండగ గురుతుంచుకోవాలె
(మరింత…)

మనిషి ఎంత మంచివాడు -కాళోజి నవంబర్ 19, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
3 వ్యాఖ్యలు

మనిషి ఎంత మంచివాడు
చనిపొయిన వాని చెడును
వెను వెంటనే మరుస్తాడు
కని మంచినె తలుస్తాడు

మనిషి ఎంత చెడ్డవాడు
బ్రతికివున్న మనిషిలోని
మంచినెపుడు గుర్తించుడు
చెడును వెతికి కెలుకుతాడు

–కాళోజి 

తినలేక/ తినలేక –కాళోజి నవంబర్ 19, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
1 comment so far

ఒకడు కుతికెలదాక
మెక్కినోడు
మరొకడు మింగు మెతుకు
లేనోడు
ఇద్దరికీ గొంతు పెకలదు
ఇద్దరికీ ఊపిరాడదు
ఇద్దరి అవస్థకు
ఒకే కారణం –
తినలేక

–కాళోజి

ప్రత్యేక తెలంగాణ అంటే –కాళోజి నవంబర్ 18, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
15 వ్యాఖ్యలు

ప్రత్యేక తెలంగాణ అంటే
పక్కలిరగ తన్నేందుకు
ఆ.ప్ర.రా. ప్రభుత్వాన్కి
అధికారము ఎక్కడిది?

(మరింత…)

నిర్వాకం –కాళోజి నవంబర్ 18, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
add a comment

నమ్ముకొని పెత్తనము ఇస్తే
నమ్మకము పోగొట్టుకొంటివి

కుప్పకావలి ఉండి కట్టలు
తప్పదీస్తివి ముద్దెరేస్తివి
సాటివాడు చేరదీస్తే
నోటినిండా మన్ను గొడ్తివి

(మరింత…)

నేను – నా గొడవ –కాళోజి నవంబర్ 18, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
add a comment

నేనంటే నేడు
నా గొడవంటే  నాడు
నిజమో కాదోకల రుజువు
నీవు నేనూ వాడూ
నేనంటె నేటి మనస్థితి వైనం
నెనంటె భరత పౌరుడు
నా గొడవ ఆ పౌరుని స్థితి
నేనంటే ఒక వోటరు
నా గొడవ వోటేసేవాడు
నేనంటే తిరుగుబాటు దారు
నా గొడవ మన తిరుగుబాటు

–కాళోజి

నడత నాణ్యం -కాళోజి నవంబర్ 18, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
add a comment

దొంగవలె అందాల తొంగిచూచుట తప్పు
అగుపడిన అందాన్ని అరయకుండుట తప్పు
కనపడ్డ ప్రతిదాని కాసపడుటయు తప్పు
భంగపడి వాంఛలకు లొంగిపోవుట తప్పు
కినుకతో మదిలోన క్రుంగిపోవుట తప్పు
పైకి ప్రహ్లాదువలె పలుకుచుండుట తప్పు
సహజ ప్రవృత్తులను చంపివేయట తప్పు
సహజమని వృత్తుల చంకచేరుట తప్పు

–కాళోజి

లోకనాయక్ -కాళోజి నవంబర్ 18, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
1 comment so far

పుటుక నీది
చావు నీది
బ్రతుకుంతా దేశానిది

———————
లోకెనాయక్ జయప్రకాశ్ నారయణ్ మరణించిన సందర్బంగా కాళోజి అన్న మాటలు

చాదస్తం -కాళోజీ నవంబర్ 18, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
add a comment

ప్రతీ చాదస్తం దేవుడే
ఏదో ఒక రూపంలో గోకుడే
పుట్టుకతోనే పుట్టునీపుండు
అగపడక అంతరంగాననుండు
(మరింత…)

పోదాం పదరా!! నవంబర్ 18, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
add a comment

పదరా పదరా పోదాం పదరా
తెలంగాణ సాధిద్దాం పదరా
దొంగల దూరం కొడదాం పదరా
వేరే రాజ్యం చేద్దాం పదరా           || పదరా ||

(మరింత…)

ఏటేటా ఎందుకు నీ పాట -కాళోజీ నవంబర్ 17, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
1 comment so far

ఏడు మారినా ఈడు ముదిరినా
ఏమి మారినది యీ లోకంలో?
రాయి రువ్వినా రాకెట్ విసిరినా
గిట్టని వానిని కొట్టుటకే కద!
(మరింత…)

వ్యత్యాసాలు -కాళోజీ నవంబర్ 17, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
add a comment

అన్నపురాసులు ఒక చోట
ఆకలిమంటలు ఒక చోట
హంసతూలిక లొకచోట
అలసిన దేహా లొకచోట
(మరింత…)